Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందరి అభిప్రాయాలతో 11 అంశాలపై నివేదిక రూపొందించాం : జైపాల్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కలసి మేధోమథనం నిర్వహించి... 11 అంశాలపై నివేదికను రూపొందించామని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. విభజన విషయంలో ఏది సాధ్యం, ఏది అసాధ్యమో చర్చించి ఓ నోట్ ను తయారుచేశామని తెలిపారు. టీ.కాంగ్రెస్ తరపున జీవోఎంకు నివేదిక ఇస్తామని చెప్పారు. అనంతరం బంతి ప్రభుత్వం కోర్టులోకి పోతుందని తెలిపారు. భద్రాచలం గురించి జీవోఎంతో సమావేశానికి ముందు మాత్రమే మాట్లాడగలమని అన్నారు. విభజన తర్వాత తెలంగాణలో విద్యుత్ సమస్య ఉంటుందని జైపాల్ అభిప్రాయపడ్డారు.

సీమాంధ్రులకు అన్యాయం చేయాలనే ఆలోచన తమకు లేదని జైపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందేంతవరకు జాతీయ పార్టీలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయమని అన్నారు. దీనికితోడు... తెదేపా, వైకాపాల గురించి కానీ సీమాంధ్ర కాంగ్రెస్ నేతల గురించి కానీ ఇప్పుడు కామెంట్ చేయమని... ఎందుకంటే ఇది సుహృద్భావం నెలకొనాల్సిన సమయమని తెలిపారు.

More Telugu News